జార్ఖండ్ నూతన సీఎంగా జేఎంఎం పార్టీ సీనియర్ నాయకులు చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్.. చంపైతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అలాగే, ఆయన బల నిరూపణ చేసుకునేందుకు చంపైకు 10 రోజుల గడువిచ్చారు. గత సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు అయిన 48 గంటల్లోపు కొత్త సీఎంగా చంపై ప్రమాణ స్వీకారం చేశారు.