క్యాన్సర్ మహమ్మారి గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన వ్యాధి. అయితే ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ - డబ్ల్యూహెచ్ఓ భయంకరమైన గణాంకాలను వెల్లడించింది. 2022 లో ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మందికి క్యాన్సర్ సోకినట్లు తాజాగా ప్రకటించింది. ఇక అదే ఏడాది.. 97 లక్షల మంది క్యాన్సర్ ధాటికి ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇక దేశంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. భారత్‌లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు వెలుగు చూడగా.. సుమారు 9.1 లక్షల మంది మరణించినట్లు పేర్కొనడం సంచలనంగా మారింది.
ఇక ఎక్కువ శాతం మంది భారతీయులు రొమ్ము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా 1.92 లక్షల కేసులు రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించినవే నమోదైనట్లు పపేర్కొంది. ఎక్కువ శాతం మంది పురుషుల్లో పెదవి, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు తెలిపింది. నోటి క్యానర్స్ 15.6 శాతం, శ్వాసకోస క్యాన్సర్ 8.5 శాతం కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఇక మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కేసులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
భారత్‌లో 27 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు, 18 శాతం సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ కేసులు ఉన్నట్లు.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు క్యాన్సర్ ఏజెన్సీగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ అంచనా వేసింది. అయితే క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన 5 ఏళ్ల తర్వాత కూడా భారత్‌లో ప్రాణాలతో ఉన్న వారి సంఖ్య 32.6 శాతంగా ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ప్రతీ అయిదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందని పేర్కొంది. 9 మంది పురుషుల్లో ఒకరు.. 12 మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించింది.
తాజాగా అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహనా దినోత్సవం సందర్భంగా.. 115 దేశాలకు చెందిన క్యాన్సర్ రిపోర్టును డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది. కేవలం 39 శాతం దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి ప్రజల్లో సరైన అవగాహన కల్పిస్తున్నట్లు ఆ నివేదికలో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మందిలో కొత్తగా క్యాన్సర్‌ను గుర్తించగా.. అందులో 97 లక్షల మంది మరణించినట్లు ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.
పెదవి,నోటి కేన్సర్ కేసులు, ఊపిరితిత్తుల కేన్సర్లు పురుషులలో సర్వసాధారణంగా మారాయని, కొత్త కేసులలో అవి వరుసగా 15.6 శాతం, 8.5 శాతంగా ఉన్నాయని గణాంకాలు పేర్కొన్నాయి. అయితే రొమ్ము, గర్భాశయ కేన్సర్లు మహిళల్లో చాలా తరచుగా సంభవిస్తున్నాయి. రొమ్ము కేన్సర్ కేసులు దాదాపు 27 శాతం వరకు ఉండగా, గర్భాశయ కేన్సర్ కేసులు 18 శాతంగా నమోదయ్యాయి. అధిక శాతం మరణాలకు ఈ కేన్సర్ రకాలే కారణమని డబ్ల్యూహెచ్ఓకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ కేన్సర్(ఐఏఆర్‌సీ) అభిప్రాయపడింది. కేన్సర్ నిర్ధారణ అయిన తర్వాత 5 సంవత్సరాలలోపు జీవించి ఉన్న వారి సంఖ్య భారత్‌లో దాదాపు 32.6 లక్షలుగా ఉంది. ఇక భారత దేశంలో 75 ఏళ్లలోపు ఉన్నవారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం 10.6 శాతంగా ఉందని.. మరణించే ప్రమాదం 7.2 శాతంగా ఉందని ఐఏఆర్‌సీ అంచనా వేసింది.