హిందూధర్మాన్ని కాపాడటం.. దేవాలయాలు పరిరక్షించడంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు చూపినంత చిత్తశుద్ధి గతంలో ఎవరూ చూపించలేదన్నది వాస్తవం అని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అయన మాట్లాడుతూ... అలాంటి జగన్‌గారికి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎక్కడా పోలికలేదు. చంద్రబాబు హయాంలో దేవాలయాల్ని ఇష్టానుసారంగా కూల్చివేశారు. వాటిని చెత్తను తరలించే డస్ట్ బిన్లలో విసిరేసి దుర్మార్గమైన నైజాన్ని చాటుకున్నారాయన. ఆయన హయాంలో విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చేసి , పవిత్ర విగ్రహాలను చెత్త వేసే డంపింగ్‌యార్డుల్లో పడేసిన దుష్ట చరిత్ర చంద్రబాబుది. తిరుమలలో ధ్వజస్థంభం వరకు బూట్లు వేసుకుని వెళ్లాడు కనుకే, అప్పట్లో అలిపిరి దుర్ఘటన జరిగింది. అయినా బాబుకు బుద్ధిరాలేదు. కనకదుర్గమ్మ గుడిలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయించిన నీచుడు. గుళ్లు కూల్చివేయించాడు. విగ్రహాలు ధ్వంసం చేయించాడు. రథాలు తగులబెట్టించాడు. ఇన్నీ చేసినా ఈనాడు రామోజీరావుకు మాత్రం కనిపించలేదు. ఆయా ఘటనలకు సంబంధించి ఒక్క వార్త కూడా ఈనాడు పత్రికలో రాయలేదు ఎందుకు..? చంద్రబాబు అనే దుర్మార్గ నేతను దేవుడు కూడా క్షమించడు గాక క్షమించడు అని అన్నారు.