చంద్రగిరి మండలంలో రూ. 1. 15కోట్ల అభివృద్ధి పనులకు చేపట్టిన ప్రారంభోత్సవాలు అంబరాన్నంటాయి. పనబాకం, కల్ రోడ్డుపల్లి, ఎం. కొంగరవారి పల్లిలో సోమవారం అభివృద్ధి పనులను తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్దే మా అభిమతంగా ప్రజల సౌకర్యార్థం పనబాకం పంచాయతీలో రూ. 25లక్షల సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa