పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నపత్రం లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ (అన్యాయమైన మార్గాల నిరోధక) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు చట్టంగా మారిన తర్వాత, దీని కింద దోషులుగా తేలిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష, రూ. రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.