శ్రీకాకుళం జిల్లా ప్రగతి కోసం ఏ నాయకులు తపించారో, సాగునీరు, తాగునీరు ఇవ్వాలని పనులు చేపట్టారో నిజాలు మాట్లాడితే బాగుంటుం దని, కానీ మంత్రి ధర్మాన మాటలు వింటే పేరులోనే ధర్మం తప్ప మాటల్లో మాత్రం అధర్మమే వినిపిస్తుం దని టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నదుల అనుసంధానం మాత్రమే రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారమని భావించి జిల్లాలో నాగావళి - వంశధార అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టి 60 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. గడిచిన 55 నెలల వైసీపీ పాలనలో మీరేం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం అన్యా యం కాదా అని ప్రశ్నించారు. నిజానికి నదుల అను సంధాన ప్రక్రియను ప్రారంభించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఈ సందర్భంగా ధర్మానకు గుర్తు చేశారు. నేరడి బ్యారేజీకి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా ఇంతవరకూ మీరేం చేశారని ప్రశ్నించారు. ఇచ్ఛాపురం, కవిటి, మందస, కంచిలి, పలాస తదితర ఎనిమిది మండలాలకు సాగునీరు, తాగునీరు అందించే ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టుకు రూ.600 కోట్లు మంజూరు చేసిందని తెలుగుదేశం ప్రభుత్వం కాదా, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి టీడీపీ హయాంలో భూసేకరణ పూర్తి చేసి, 30 శా తం నిర్మాణం కూడా చేశామని, నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇచ్చామని, మరి మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ఇక టక్కరి మంత్రి సీదిరి మీరు మరో రూ.130 కోట్లు ఖర్చు పెడితే ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తయ్యేది కదా? ఏం సాధిం చారని ప్రశ్నించారు. ఎందుకు ఈ మంత్రి పదవి.. సిగ్గనిపించడం లేదా అని అన్నారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని రూ.200 కోట్లు కేటాయిస్తే, కేవలం రూ.50 కోట్లు ఖర్చుపెట్టి, తూతూ మంత్రంగా ప్రారం భోత్సవం నిర్వహించి ప్రజలను ఎందుకు మోసం చే యాలనుకుంటారన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించ డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధికా రంలోకి వచ్చాక జిల్లాను సస్యశ్యామంల చేస్తాం, ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం, ఎనిమిది మం డలలాకు తాగునీరు అందించి తీరుతాం, నిజ మైన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నా రు. కార్యక్ర మంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, పార్టీ నాయ కులు బొనిగి భాస్కరరావు, రాష్ట్ర జంగమ సాదికార సమితి డైరెక్టర్ విభూది సూరిబాబు పాల్గొన్నారు.