జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 9న జిల్లాలో 1-19 ఏళ్ల వయస్సు వారందరికీ అల్బెండ జోల్ మాత్రలను పంపిణీ చేయాలని, ఈ కార్యక్ర మాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు ఆదేశించారు. 1-2 ఏళ్ల చిన్నారులకు సగం మాత్ర(200 మి.గ్రా.) ఆపైన 19 ఏళ్ల వరకు మాత్ర(400 మి.గ్రా) తీసుకోవాలన్నారు. మాత్రలు తీసుకోకుండా మిగిలి పోయిన వారికి ఫిబ్రవరి 16న మాత్రలు ఇస్తారని తెలిపారు. పీహెచ్‌సీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో అవగాహన కల్పించి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. డీఆర్వో వి.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, డీసీహెచ్ ఎస్ బీసీకే నాయక్, రాష్ర్టీయ బాల స్వాస్థ్య కార్యక్ర మం జిల్లా అధికారి డాక్టర్ మాధవి, స్ర్తీ శిశు సంక్షేమ జిల్లా అధికారి జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.