ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య వెళ్లాలనుకునేవారికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2024, 07:11 PM

అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట తర్వాత దేశవ్యా్ప్తంగా ఉన్న అందరి చూపు అయోధ్యపురిపైనే ఉంది. వీలైతే ఒక్కసారి అయోధ్యకు వెళ్లి బాలక్‌ రామ్‌ను దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయ విశేషాలను ప్రత్యక్షంగా చూడాలని ఆశిస్తున్నారు. అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే విమానం, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తారనే ఆలోచనతో ప్రాణప్రతిష్టకు ముందే అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు సర్వీసులు కూడా నడుస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ కూడా అయోధ్యకు వెళ్లేవారి కోసం ఓ కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగ వేళల్లో ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలకు సైతం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తూ ప్రయాణికుల మన్ననలు పొందుతోంది.తాజాగా అయోధ్యకు వెళ్లేవారి కోసం ఇప్పుడు ప్రత్యేక సర్వీసులు తెచ్చింది. అయితే ఇది అన్నిచోట్లా కాదండోయ్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం రెండు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులు అయోధ్య మీదుగా కాశీవరకూ అందుబాటులో ఉన్నాయి. రెండు సర్వీసులను కూడా సూపర్ లగ్జరీ రేంజులో ఏర్పాటుచేశారు కొవ్వూరు డిపో అధికారులు.ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భువనేశ్వర్‌, పూరీ, కోణార్క్, జాజిపూర్, ప్రయాగ్, అయోధ్యతో పాటు పలు పుణ్యక్షేత్రాలు కవర్ అయ్యేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తక్కువ ఖర్చులోనే తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారికి కొవ్వూరు డిపో తీసుకువచ్చిన ఈ సౌకర్యం ప్రయోజనం కలిగిస్తుందనే చెప్పొచ్చు. మరోవైపు ఈ సర్వీసుల్లో ప్రయాణం కోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర రూ.11,500 కొవ్వూరు ఆర్టీసీ నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com