సాధారణంగా మనం పెళ్లిళ్లకు వెళ్లినపుడు వధూవరులకు గిఫ్ట్‌లు గానీ, కట్నాలు గానీ ఇస్తూ ఉంటాం. ఈ మధ్య పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా పెళ్లి కుమార్తె, కుమారుడి తరఫు వారు కూడా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తున్నారు. అయితే ఇలాగే ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి.. పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌లు చూసి.. వారు ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి కూడా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తారా అని షాక్ అయ్యారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చిన తర్వాత అవి ఎందుకు ఇచ్చాడో పెళ్లి కుమార్తె తండ్రి వివరించాడు. ఇవి కేవలం రిటర్న్ గిఫ్ట్‌లు మాత్రమే కాకుండా తమ తరఫున అతిథులకు భద్రతా వస్తువులు అని పేర్కొన్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని ముదాపూర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం తన కుమార్తె వివాహం జరిపించాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లు పంపిణీ చేశాడు. అయితే రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లు ఇవ్వడంపై అతిథులు ఆశ్చర్యపోయారు. అయితే తాను అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లు ఎందుకు ఇచ్చాడో సెద్ యాదవ్ వెల్లడించాడు. ప్రతీ ఒక్కరి భద్రత కోసమే తాను హెల్మెట్లు ఇచ్చినట్లు తెలిపాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా ప్రమాదం జరిగినా.. తలకు ఎలాంటి గాయాలు కాకుండా ఈ హెల్మెట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.
అయితే పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్ తెలిపాడు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులు అంతా హెల్మెట్లు ధరించి.. పెళ్లి వేడుకలో డ్యాన్సులు చేసినట్లు వివరించాడు. సెద్ యాదవ్ కుమార్తె, స్పోర్ట్స్ టీచర్ అయిన నీలిమను.. సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో పెళ్లి జరిగింది.
అయితే ఆ పెళ్లికి బైక్‌పై వచ్చిన 60 మంది అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా ఈ హెల్మెట్లు పంపిణీ చేసినట్లు సెద్ యాదవ్ వివరించాడు. తన కుమార్తె పెళ్లి సందర్భంగా రోడ్డు భద్రతపై అందరికీ అవగాహన కల్పించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. జీవితం చాలా విలువైందని.. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని కోరినట్లు చెప్పాడు. చాలా ప్రమాదాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయని తెలిపాడు.