ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 17 మెడికల్ కాలేజీలకు డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలలుగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
వైద్యరంగం బలోపేతానికి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశేషంగా కృషి చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య శ్రీ, వైద్య కళాశాలల ఏర్పాటు, 108, 104 వాహనాల వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేసింది.