గుణదల మాత ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మూవింగ్ పార్టీల ఏర్పాటు, భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునేలా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఉత్సవాలకు వచ్చే దారులన్నీ పరిశీలించి ట్రాఫిక్‌కు అంతరాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశరు. కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు, సెంట్రల్ జోన్ ఏసీపీ పి.భాస్కరరావు, మాచవరం సీఐ గుణరామ్ తదితరులు పాల్గొన్నారు.