తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం/అనపర్తి మండల పరిధిలోని యర్రపోతవరం లాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పామర్రు ఎస్.ఐ. జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి సావరంకు చెందిన దుర్గాడ జానీ(26), లక్ష్మీనరసాపురంకు చెందిన పిల్లి ప్రసాద్(28)లు మరో ఇద్దరు స్నేహి తులతో కలసి ఆదివారం ఉదయం యానాం వెళ్ళారు. అక్కడ పని ముగించుకుని తిరిగి యానాం నుంచి అనపర్తి వెళుతున్న సందర్భంలో యర్రపోతవరం లాకుల వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో జానీ, ప్రసాద్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ, సి.ఐ. పి.దొరరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరణించిన ప్రసాద్, జానీ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు చెప్పారు. ప్రసాద్, జానీ మరణంతో రెండు కుటుంబాలు వారు కుటుంబ పెద్దలను కోల్పోయారు. వీరిలో జానీకి చదువుకు ంటున్న తమ్ముడు, ప్రసాద్‌కు పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు ఉన్నారు. వీరి మరణం తో అనపర్తి సావరం, లక్ష్మీనరసాపురం గ్రామాల్లో విషాదం అలుముకుంది.