కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డు గుండ్లప్పదొడ్డి, ఆజాద్ నగర్, 23వ వార్డు గరీబ్ నగర్ లో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉన్నం వరలక్ష్మి చీర పసుపు కుంకుమ ఇచ్చి టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి మున్సిపాలిటీలోని డ్రైనేజీల శుభ్రత గాలికి వదిలేశారన్నారు.