రణస్థలం, కమ్మసిగడాం మహాలక్ష్మి తల్లి జాతర ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుందని కమిటీ ప్రధాన కార్యదర్శి నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు జాతరకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆలయంలో ఆవిష్కరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. రథసప్తమి రోజున పెళ్లిరాట వేయనున్నట్లు చెప్పారు. కార్య క్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు వెలిచేటి రామకృష్ణ, వెలిచేటి రవిచంద్ర, తేజ, కోశాధికారి వెలి చేటి రాజశేఖర్, కార్యదర్శి మన్నె లక్ష్మీప్రసాద్, సింహాచలంరాయుడు, గోపిన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.