కర్ణాటకలో ‘మంకీ ఫీవర్’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. అక్కడ నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయమై ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం అన్ని జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులకు సర్క్యులర్ పంపారు. ‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (KFDV)అనే మంకీ ఫీవర్‌తో కర్ణాటకలో 53మంది చికిత్స పొందుతుండగా, ఇద్దరు మృతి చెందారన్నారు.