ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని మోదీ అన్నారు. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024లో మాట్లాడుతూ..
గత పదేళ్లుగా మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో భారత్ పనిచేస్తోందని తెలిపారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో దుబాయ్ ప్రపంచ ఆర్థిక, సాంకేతికకేంద్రంగా మారుతోందని ప్రశంసించారు.