ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యాకు సహాయం చేసినందుకు భారత్, చైనీస్ సంస్థలపై ఈయూ ఆంక్షలు

international |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 11:13 AM

 ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన మూడు కంపెనీలపై పాటు దాదాపు రెండు డజన్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ కొత్త వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది.బ్లూమ్‌బెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో హాంకాంగ్, సెర్బియా, భారతదేశం, టర్కీకి చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, రష్యా సామర్థ్యాన్ని అణిచివేసేందుకు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలతో వ్యాపారం చేయకుండా యూరోపియన్ కంపెనీలను ఆంక్షలు నిషేధించాయి. గతంలో EU అనేక చైనీస్ కంపెనీలను బ్లాక్ లిస్టు జాబితా చేయాలని ప్రతిపాదించింది.. అయితే కొన్ని సభ్య దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు కుదరలేదు..కాగా, జర్మనీకి, వోక్స్‌వ్యాగన్ AGతో సహా కార్ల తయారీదారులకు చైనా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఈయూ ఆంక్షలకు అన్ని సభ్య దేశాల మద్దతు అవసరం అయింది. ఈ ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు కమిషన్ ప్రతినిధి నిరాకరించారు. బ్రస్సెల్స్‌లోని చైనా రాయబార కార్యాలయానికి పంపిన సందేశానికి ఇప్పటి వరకు సమాధానిం రాలేదని యూరోపియన్ యూనియన్ తెలిపింది. అయితే, టెక్నాలజీ- ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రష్యా యొక్క సైనిక, సాంకేతిక వృద్ధికి లేదా మస్కో యొక్క రక్షణ, భద్రతా రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని ఈయూ ఆరోపించింది.


ఈయూ ఆంక్షలతో చైనాతో యూరప్ దేశాల వ్యాపారం రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టింది. కానీ పెరుగుతున్న చైనా ఎగుమతులు కారణంగా ఇది తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే, రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సైనిక సామగ్రిని అందించకూడదని వాన్ డెర్ లేయన్ అన్నారు. ఈ ప్రతిపాదనలను ఉల్లంఘించిన మూడు చైనా కంపెనీలు, భారత్, శ్రీలంక, సెర్బియా, కజకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, హాంకాంగ్‌ల నుంచి ఒక్కొక్క కంపెనీ ఉన్నాయన్నారు. ఇక, ఈయూ ఇప్పటి వరకు 620 కంటే ఎక్కువ కంపెనీల జాబితా చేసింది.. వీటిలో ఎక్కువ భాగం రష్యాకు చెందినవి ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com