విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం పి.కొత్తకోట ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ సురే్‌షను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ షన్మోహన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 13న ఆ శాఖ డీడీ రాజ్యలక్ష్మి వసతిగృహాన్ని తనిఖీ చేశారు. ఆ సందర్భంగా వార్డెన్‌తో పాటు సిబ్బంది కూడా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, మరుగుదొడ్లు సరిగ్గా లేవని ఆమె దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె పంపిన నివేదిక మేరకు.. వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.