గుంతకల్లు పట్టణంలోని టాక్సీ డ్రైవర్లు యూనియన్ నాయకులు జయప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమక్షంలో 20 కుటుంబాలు చేరాయి. ఎమ్మెల్యే వారికి వైకాపా కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం చూసి పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. పార్టీలోకి చేరిన వారిలో ఎర్రిస్వామి, సుల్తాన్, భాస్కర్ తదితరులు ఉన్నారు.