వైసిపి రాష్ట్ర న్యాయ విభాగ కమిటీ జాయింట్ సెక్రటరీగా చీరాలకు చెందిన న్యాయవాది కర్నేటి రవి నియమితులయ్యారు. 69 మందితో ఈ కమిటీని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు. జగన్ ఓదార్పు యాత్ర నుండి చీరాల నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్న రవి వైసిపి బలోపేతానికి విశేష కృషి చేశారు. చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా రవి పని చేశారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి ఆయన సన్నిహితుడు.