విశాఖ ఉక్కు కర్మాగారం భూముల అమ్మకానికి ఏపీలో కాకుండా హైదరాబాద్‌లో పేపర్‌లో ప్రకటన జారీ చేసినట్టు ఇప్పుడే సెల్‌ఫోన్‌లో చూశా. ఆ భూములు ఎవరు కొనుగోలు చేసినా అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుంటాం. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం అని టీడీపీ యువనాయకులు నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై వేల కేసులు, నాపై హత్యాయత్నంతోపాటు మొత్తం 22 కేసులు పెట్టారు. చంద్రబాబును అర్ధరాత్రిపూట అరెస్టు చేసి అక్రమంగా 53 రోజులు జైలులో పెట్టారు. ప్రతి దుకాణం, కూడళ్ల వద్ద మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడుతున్నారు. అయితే ఆయన్ను చెల్లి, తల్లే నమ్మడం లేదు. అటువంటప్పుడు మనం ఎలా నమ్మాలి? షర్టు మడత పెడతానని జగన్ అంటున్నారు. ప్రజలు మాత్రం ఆయన కుర్చీని మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.