టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఓ వైపు జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు గన్‌షాట్‌గా ఉండే సీట్లలో ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఇంఛార్జ్‌గా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నియమించారు. తాజాగా మరో నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను నియమిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా సొంగా రోషన్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చింతలపూడి నియోజకవర్గంలో అక్కడ ఇంఛార్జ్ లేకపోవడంతో కేడర్ గందరగోళంలో ఉంది. ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. సొంగా రోషన్‌తో పాటుగా అనిల్ బొమ్మాజి, ఆకుమర్తి రామారావు, మాజీ మంత్ర పీతల సుజాత పేర్లు వినిపించాయి. అయితే అనిల్, రోషన్‌లలో ఒకిరికి టికెట్ ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరిగింది. అలాగే ఇద్దరు నేతలు కలిసి ఎవరికి టికెట్ దక్కినా గెలుపు కోసం పనిచేయాలని చర్చించుకున్నారు. చివరికి ఎన్నారై రోషన్ కుమార్‌కు చింతలపూడి టికెట్ దక్కింది.
టీడీపీ టికెట్ కోసం ఎన్నారై సొంగా రోషన్ కుమార్ గట్టి ప్రయత్నాలే చఏశారు. కొంతకాలంగా సొంగ రోషన్ కుమార్ పార్టీ కోసం పనిచేస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో టీడీపీ చేపట్టే కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. మొత్తానికి చంద్రబాబును మెప్పించి ఇంఛార్జ్ పదవిని దక్కించుకున్నారు. చింతలపూడి టికెట్‌ను రేసులో మాజీ ఐఏఎస్ అధికారి గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దానం కుమారుడు అనిల్ పేరు తెర మీదకు తెచ్చారు. అనిల్ సోదరుడు విజయ కుమార్ సంతనూతల పాడు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొంది టీడీపీలోనే ఉన్నారు. అనిల్ విదేశాల్లో చదువుకున్నారు.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బీఈడీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ఆయన కొంతకాలంగా చింతలపూడి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఆయన టికెట్ ఆశించారు.. కానీ అధిష్టానం రోషన్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.