ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి.. అటు వాళ్లు ఇటు.. ఇటు వాళ్లు అటు జంపింగ్‌లు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలొచ్చాయి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని.. ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి పార్టీ మారడం ఏంటని టీడీపీలో కూడా చర్చ మొదలైంది.
ఈ క్రమంలో కొనకళ్ల నారాయణ పార్టీ మార్పుపై స్పందించారు. రెండు రోజులుగా తాను కొనకళ్ల చేరుతున్నానని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోనే కొనసాగుతాను అని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.. తాను వైఎస్సార్‌సీపీలో చేరే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్లతమ క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తానన్నారు నారాయణ.
కొనకళ్ల నారాయణ మచిలీపట్నం ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు.. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈసారి టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నం సీటు జనసేనకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొనకళ్ల నారాయణ వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా వైఎస్సార్‌సీపీ మైండ్ గేమ్ అని.. కొనకళ్ల పార్టీ మారడం లేదని.. ఇది ఫేక్ ప్రచారం అంటూ కౌంటరిస్తున్నారు.