ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి జగన్‌పై మాటలధాడి మామూలుగా లేదు. సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్‌పై ఎప్పటికప్పుడు షర్మిల విరుచుకుపడుతూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలన, జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీసీసీ చీఫ్.. ప్రభుత్వంతో సమరానికి కాలుదువ్వారు. ఈరోజు షర్మిల ఆధ్వర్యంలో ‘‘ఛలో సెక్రటేరియట్’’కు ఏపీ కాంగ్రెస్ పిలుపునివ్వగా.. పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. అయితే షర్మిల గత రాత్రే ఆంధ్రరత్న భవన్‌కు చేరుకుని.. ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఆంధ్రరత్న భవన్ వద్ద పోలీసుల ఆంక్షలపై షర్మిల తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఛలో సెక్రటేరియట్ అంటే తమపై ఆంక్షలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?... వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగంపై అడిగితే మా పైనా , మీడియాపై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.