'ఢిల్లీ ఛలో' మార్చ్ నిరసన ర్యాలీకి రైతు సంఘాలు తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఢిల్లీలో ట్రాఫిక్‌కు కాస్త ఉపశమనం కలుగుతోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు రెండో విడత ఢిల్లీ ఛలో చేపట్టిన దీక్షకు ఈ నెల 29 వరకు విరామం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా మధ్య సింగు, టిక్రీ సరిహద్దులను పోలీసులు సోమవారం తెరిచారు. ఈ సరిహద్దులను తెరవడం వల్ల వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని పోలీసులు తెలిపారు.