రాష్ట్రంలో డబులింజన్ ప్రభుత్వం రావాల్సిందేనని పోలవరం నిర్మాణం సాధ్యం కావాలన్నా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలన్నా ఇదొకటే ఏకైక మార్గమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఒకప్పుడు రక్షణ విభాగం ఏకే 47 ఆయుధాలను కొనుగోలు చేసేదని, బీజేపీ పాలనలో ఏకే–203 ఆయుధాలను ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం తయారు చేస్తోందని, ఇది ఘనత కాదా అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి అందరూ అందుకోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అందరూ అండగా ఉండాలన్నారు. అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సీనియర్ నేత పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ అన్నింటికీ సిద్దం అంటున్నారని బీజేపీ మాత్రం సేవకే సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర సంఘటన్ మంత్రి మధుకర్‌జి, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందే శ్వరి, జిల్లా అధ్యక్షుడు విక్రం కిశోర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణప్రసాద్, అంబికా కృష్ణ, మహిళా మోర్చ అద్యక్షురాలు నిర్మలా కిశోర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సుభాష్ రాజు, ఈతకోట తాతాజీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.