మార్చి 1న తిరుపతిలో జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
వైసీపీ ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు. 10 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అని తిరుపతి సభలో ప్రధాని మోడీ మాట ఇచ్చారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అదే వేదికగా ఇప్పుడు హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తామని షర్మిల తెలిపారు.