ఎస్పీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సాక్షిగా ఆయనను పిలిచింది.
కాగా.. అఖిలేష్ 2012-2017 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. 2012-2013లో మైనింగ్ విభాగం బాధ్యతలు పర్యవేక్షించారు. ఆ సమయంలో అక్రమ మైనింగ్ జరిగిందనే ఆరోపణలతో ఆయనను విచారణకు పిలిచారు.