తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి మాట్లాడారు.
తాము చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఓ ఫ్రంట్‌గా ఏర్పడి అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని విమర్శించారు.