క్రమబద్ధీకరణ పేరుతో సచివాలయ ఉద్యోగులను దూర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం పట్ల ఆయా ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇటువంటి విధానాన్ని వెంటనే ఆపాలంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు రవికుమార్, జ్యోతి, రవికిశోర్, శ్రీనివాసులు, వెంకట్రెడ్డి, కవిత, గాయత్రి, ఉష తదితరులు బుధవారం లేపాక్షి ఎంపీడీవో వాసుదేవగుప్తాకు వినతి పత్రం అందించారు.