పేదల చదువుల కోసం ఈ 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.