రూ. 25 కోట్లు విలువైన 50 సెంట్లు భూమిని కాపు భవనానికి సీఎం వైయస్ జగన్ కేటాయించారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తాం. విశాఖ నగరంలో ఇప్పటికే అనేక కళ్యాణ మండపాల నిర్మాణం పూర్తి చేశాం. 2019 ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరఫున 31మంది కాపులు పోటీ చేసేందుకు సీఎం వైయస్ జగన్ అవకాశం కల్పించారు. ఆ 31 మందిలో 29 విజయం సాధించారు. ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను చంపిన వారికి.. ముద్రగడ పద్మనాభంను అవమానించిన వారికి మద్దతు చెబుతారో.. కాపులకు మేలు చేసిన వారికి అండగా ఉంటారో మీరే(కాపులను ఉద్దేశించి..) నిర్ణయించుకోవాలని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు ఇచ్చారు.