ఏపీ ప్రజలకు శుభవార్త. రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధునాతనమైన లింకె హాఫ్‌మన్ బచ్చ్ బోగీలను కాకినాడ-లింగంపల్లి-కాకినాడల మధ్య రాక పోకలు సాగించే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు ఆదివారం నుంచి ప్రారంభించారు.. కాకినాడ, సామర్లకోట రైల్వేస్టేషన్లకు ఈ మేరకు రైల్వే పీఆర్వో కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.ఈ అధునా తన బోగీలను ప్రాథమికంగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గత ఏడాది జూలై నెలలో ప్రారంభించా రు. ఈ బోగీలు సత్ఫలితాలను ఇవ్వడంతో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను మార్పులు చేస్తున్నారు.
కాకినాడ-లింగంపల్లి- కాకినాడల మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా ఎల్‌హెచ్‌బీ బోగీలను అనుసంధానం చేశారు. ఈ అధునాతన బోగీలను జర్మనీ కొలాబ్రేషన్‌తో కపూర్తలాలో తయారుచేస్తున్నారు. ఈ అధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీ లతో ప్రయాణం ఎటువంటి కుదుపులు, సౌండ్స్ లేకుండా సాఫీగా సాగుతుంది. డబుల్ సస్పెన్షన్, డిస్క్, బ్రేకింగ్ విధానంతోనూ ఈ బోగీలలో ప్రయాణం చాలా బావుంటుందని ఇస్తుందని రైల్వే అధికారలు తెలిపారు. మొత్తం 24 బోగీలలో 22 బోగీలు ఎల్‌హెచ్‌బీ బోగీలే కావడం విశేషం.
![]() |
![]() |