టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని జైలుకు పంపడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎమ్మెల్యే కొన్న పొలాల దగ్గర ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకున్నారని మండిపడ్డారు.
ఆయన సొంత భూముల విలువ పెరిగే విధంగా చేసుకున్నాడని దుయ్యబట్టారు. అతని అవినీతి, దుర్మార్గాలపై, విచారణ చేపట్టి బొల్లాను జైలుకు పంపడం ఖాయమని తెలిపారు.