భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. దీంతో మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు చైనా ముందుకొచ్చింది.
దీనిపై ఇరు దేశాలు తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. తమ దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు డెడ్‌లైన్ విధించిన కొన్ని వారాలకే ఈ ఒప్పందం జరిగింది.