యూఎస్-దక్షిణ కొరియాలు వారి వార్షిక కంప్యూటర్-సిమ్యులేటెడ్ కమాండ్ పోస్ట్ శిక్షణ, వివిధ రకాల డ్రిల్స్ సోమవారం ప్రారంభించాయి. అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీవ్రంగా హెచ్చరికలు చేశాడు.
తమ దేశంపై దాడి చేయడానికి ఇరు దేశాలు కుట్ర పన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయన్నారు. వీటిని వెంటనే నిలిపివేయాలన్నారు. లేకపోతే ఇరు దేశాలు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.