ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో గతంలో ఆయనకు విధించిన జీవితఖైదును రద్దుచేస్తూ.. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
గతంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రొ. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.