ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్, జిపిఎస్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు రామప్ప చౌదరి, ఆయా మండలాల నాయకులు జయరాములు, శ్రీనివాసులు, రఘు, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆ దిశగా తెదేపా ఎన్నికల ప్రణాళికలో రద్దు చేస్తామన్న విషయంతో పాటు పాత పింఛను అమలు చేస్తామన్న అంశాన్ని పొందుపరుచాలని కోరుతూ మంగళవారం రాత్రి వారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవుకు వినతిపత్రం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa