కర్ణాటకలోని మైసూర్, నంజన్కూట్ సమీపంలో బుధవారం విషాద ఘటన జరిగింది. బీహార్‌కు చెందిన మనుకుమార్ (26) వృత్తిరీత్యా కార్పెంటర్. కొన్నాళ్లుగా నంజన్కూట్ సమీపంలోని కావలండే గ్రామంలో ఉంటున్నాడు.
అతడి భార్య బీహార్‌లో ఉంటోంది. రోజూ లాగే భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటాడు. ఆ సమయంలో సామ్రాజ్ నగర్ నుంచి మైసూర్ వెళ్తున్న రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే మనుకుమార్ చనిపోయాడు.