పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మొలకలచెరువు మండలంలో గురువారం రాత్రి వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని దేవలచెరువుకు చెందిన రసూల్ సాబ్ కొడుకు ఫయాజ్(32) గొర్రెలు మేపుకొని జీవిస్తున్నాడు. ఇటీవల కొన్ని గొర్రెలు చనిపోవడంతో మనస్థాపం చెంది విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.