అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా స్టెమ్ లో మహిళల పాత్ర గురించి తెలుసుకుందాం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో 2010-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 29 లక్షల మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు ఓ సర్వేలో తేలింది.
ఇది ఆయా కోర్సుల్లో అబ్బాయిల దరఖాస్తుల కంటే అధికం. అదే ఏడాది స్టెమ్ లో 26 లక్షల మంది అబ్బాయిలు దరఖాస్తు చేసుకున్నారు. అబ్బాయిల కంటే ఎక్కువగా మహిళలు వివిధ కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.