మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శివాలయాలను భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కొలువై ఉన్న తుంగనాథ్ శివాలయం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది.
పంచ కేదార ఆలయాల్లో ఒకటైన తుంగనాథ్ ఆలయం.. 12,070 అడుగుల ఎత్తులో ఉంది. ఈ తుంగనాథ్ రాతితో నిర్మించిన ఈ ఆలయం పరిమాణంలో చిన్నదే అయినా.. వాస్తు కట్టడం అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ స్వచ్చమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.