ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణాన్ని సురక్షిస్తాయని అందరూ అనుకుంటారు. అయితే దీనిపై ఉద్గారాల డేటాను విశ్లేషించే ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ అధ్యయనం చేసి షాకింగ్ నివేదిక ఇచ్చింది.
అందులో చమురుతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్‌లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తాయని పేర్కొంది. ఈ వాహనాలు అధిక బరువు కారణంగా దాని టైర్లు త్వరగా అరిగిపోయి హానికరమైన రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయని తెలిపింది.