ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. కేజీ ఎంతంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 11:22 PM

విశాఖపట్నం సముద్రంలో మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. పూడిమడక మత్స్యకారులకు అరుదైన ఒడిమిను చేప వలలో పడింది. చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ చేపను తీరానికి తీసుకొచ్చారు. మత్స్యకార వ్యాపారి కొండయ్య కేజీ రూ.900 చెల్లించి దీనిని కొనుగోలు చేశాడు. ఈ చేపను చూడడానికి మత్స్యకారులు సైతం ఉత్సాహం చూపించారు. నాలుగు అడుగుల పొడవైన చేప చిక్కడం అరుదని మత్స్యకారులు తెలిపారు. సాధారణంగా చేపలు లావుగా, బరువుగా ఉంటాయి. సాధారణ చేపలు గరిష్ఠంగా 2 నుంచి 3 అడుగులు ఉంటుంటాయి. కానీ ఈ నాలుగు అడుగుల చేపలు చాలా అరుదు అంటున్నారు మత్స్యకారులు.


సాధారణంగా ఒడిమీను చేపలు మూడు అడుగులకు మించి ఎప్పుడూ చూడలేదంటున్నారు. నాలుగు అడుగుల పొడవైన చేప చాలా అరుదుగా దొరుకుతాయంటున్నారు. ఈ చేపలలో ఔషద గుణాలు ఎక్కువ ఉంటాయని.. అందుకే డిమాండ్ ఉంటుందంటున్నారు. కొన్ని రకాల ఔషధాల తయారీలో ఈ చేపను ఉపయోగిస్తారట.. ఇలానే కోనం, వజ్రం రకాల చేపలు కూడా దొరికినా ఈ ఒడిమీకి ప్రాధాన్యత ఉందంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com