ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఏపీ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. మరో రెండింటిని అందబాటులోకి తెస్తోంది. మార్చి 12వ తేదీ న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మార్గంలో ఇప్పటికే ఒక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుండగా.. ఈ మార్గంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా మరో వందేభారత్ రైలును అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే విశాఖపట్నం - పూరీ మధ్య మరో వందేభారత్ రైలును అందుబాటులోకి తెస్తున్నారు.
సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గురువారం తప్ప వారంలో మిగతా ఆరు రోజులు నడుస్తుంది. ప్రతిరోజూ ఉదయం 5.05 గంటలకి సికింద్రాబాద్‌లో బయలుదేరిమధ్యాహ్నం 1.50 గంటలకి విశాఖ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకి విశాఖపట్నంలో బయలుదేరి రాత్రి 11.20 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక పూరి, విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. శనివారం మినహా వారంలో మిగిలిన ఆరురోజులు నడుస్తుంది. పూరిలో ఉదయం 5.15 బయలుదేరనున్న ఈ రైలు.. ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40 కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరికి చేరుకుంటుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో ఈ విశాఖ- పూరీ వందేభారత్ రైలు ఆగుతుంది.