ఆంధ్రప్రదేశ్‌లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్న వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్.. కొత్తవలస స్టేషన్‌లో పట్టాలు తప్పింది. విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం బయల్దేరిన రైలు.. కొత్తవలస స్టేషన్ చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నెంబర్ 5 నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు.. రెండో నంబరు లైన్‌కు మారే సమయంలో పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. మెయిన్ లైన్ నుంచి మిడిల్ లైన్‌కు మారుతున్న క్రమంలో పట్టాలు తప్పి అక్కడే ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో రైళ్లోని రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే లోకోపైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లు తెలిసింది. అప్పుడే స్టేషన్ నుంచి బయల్దేరిన నేపథ్యంలో రైలు నెమ్మదిగా వెళ్తోంది. దీంతో పట్టాలు తప్పినప్పటికీ ప్రమాదం జరగలేదు.ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. మరోవైపు గతేడాది కూడా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది చనిపోయారు. అయితే లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్ సెల్‌ఫోన్లో క్రికెట్ చూడటమే ప్రమాదానికి కారణమని ఇటీవలే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.