ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది.
ఇందులో జింక్, విటమిన్ ఏ, బీ6, థయమిన్, రైబోప్లావిన్, నియాసిస్ వంటి పోషకాలు కలపడం వల్ల చిన్నారులు, మహిళల్లో ఉండే రక్తహీనతను అధిగమించొచ్చని ఎన్ఐఎన్ తెలిపింది. ఈ బియ్యం వండుకోకుండా కొందరు అవగాహనలోపంతో కేజీకి రూ.10 కోసం అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.