రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగారాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్,
అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.