పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని టీడీపీ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాస్‌కే ఇవ్వాలని కోరుతూ టీడీపీ నాయకులు, కార్య కర్తలు డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెం సెంటరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన తెలిపారు. బొరగంకే టిక్కెట్ ఇవ్వాలని ఆండ్రూ శ్యామ్ కుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పక్కనే వున్న నాయకులు, కార్య కర్తలు డబ్బా లాక్కుని సముదాయించారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తామని కాకపోతే గెలిచే అభ్యర్థికే సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. మడకం రామకృష్ణ, తెల్లం వెంకటేశ్వ రావు, మొడియం బుజ్జి, జారం చాందినీ విద్యా సాగరిక, పూసం ముక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్ఠానం పునరాలోచన చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు కుంచే దొరబాబు కోరారు. బొరగం ఇంటి వద్ద ఆదివారం జరిగిన మండల పార్టీ సమా వేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. పాపోలు గణపతి రత్తయ్య, గుబ్బా రాంబాబు, పెద్దేహపు సత్యనారాయణ, జల్లేపల్లి వెంకట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం స్థానాన్ని టీడీపీకి కేటాయించి, బొరగంకే టిక్కెట్టు ఇవ్వాలని వేలేరుపాడు మండల టీడీపీ కార్యవర్గం ఏకగ్రీవం గా తీర్మానించింది. పార్టీ మండల అధ్యక్షులు అమరవరపు అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న టీడీపీకే కేటాయించాలని కోరారు. సంజీవులు, కొమ్మన వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, ముత్యాలరావు పాల్గొన్నారు.