నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా? అని ఫైర్ అయ్యారు. విశాఖలో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం వైయస్ జగన్‌కు ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంటా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారు. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు. సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైయస్ఆర్‌సీపీ గెలుస్తుంది’ అని బొత్స అన్నారు. ఇక.. చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు మంతి బొత్స సత్యనారాయణ. వారం రోజులుగా ఈ రాష్ట్రంలో పొత్తుల కోసం టీడీపీ, సెలబ్రిటీ పార్టీ తహతహలాడాయి అని మంత్రి ఎద్దేవా చేశారు.. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం.. కానీ, 14ఏళ్ల పాలించిన చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఎన్టీఆర్‌కు వెన్నుపోట్లు పొడిచారని.. అమరావతి రైతుల ఆకాంక్షలను దెబ్బ తీశారని మూడు నెలల క్రితం బీజెపీ నేతలు మాట్లాడారు.. పొత్తులు పెట్టుకున్నప్పుడు రాష్ర్ట ప్రయోజనాల సంగతి ఏదీ..? అని నిలదీశారు.